calender_icon.png 10 July, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు బాసటగా నిలుస్తాం

10-07-2025 12:16:00 AM

ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

వారసిగూడ, జూలై 9 (విజయక్రాంతి) : రాష్ట్రం లోని వికలాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని, పించన్ల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు అందే రాంబాబు, కొల్లి నాగేశ్వర్ రావు, భువనేశ్వర్‌ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం బుధవారం సికింద్రా బాద్‌లో పద్మారావు గౌడ్‌ను ఆయన నివాసంలో కలిసి ఓ వినతి పత్రాన్ని అందించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో  వికలాంగులకు సంబంధించి పొందు పరచిన హామీలను అమ లు జరిపేలా ఒత్తిడి తేవాలని వారు విజ్ఞప్తి చేశారు. వికలాంగుల డిమాండ్లు సహేతుకమేనని, వారి ప్రయోజనాలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.