calender_icon.png 11 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జహంగీర్ కుటుంబానికి అండగా ఉంటాం

10-10-2025 01:06:29 AM

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, అక్టోబర్ 9(విజయక్రాంతి): నగరంంలోని హబీబ్ నగర్ కు చెందిన జహాంగీర్ 10 నెలల క్రితం స్థానిక అలీస్ మార్ట్ వద్ద విద్యుత్ ఘాతం తో మృతి చెందారు.  విద్యుత్తు శాఖ అధికారులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.  విద్యుత్తు శాఖ అధికారులు మృతుని కుటుంబానికి రూ 4 లక్షల 50 వేలు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు.

అందుకు సంబంధించిన చెక్కు ను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు గౌరవ ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ సాదతుల్లా, మైబు విద్యుత్తు శాఖ అధికారులు తదితరులుపాల్గొన్నారు.