30-10-2025 06:46:47 PM
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కొత్తపల్లి (విజయక్రాంతి): తుఫాను ప్రభావంతో వివిధ పంటలు దెబ్బ తినడంతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, వల్లంపహాడు, తీగల గుట్టపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటతో పాటు వివిధ పంటలను గురువారం వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. తీగల గుట్టపల్లి లో ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంతో ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దనీ, మీకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని భరోసా కల్పించారు.
ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. పంట నష్టం వివరాలను తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు పక్కాగా నష్టం వివరాలు తనకు అందించాలని సూచించారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తానని వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలను పకడ్బందీగా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజాను కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రత్యేకంగా మాట్లాడుతానని రాజేందర్ రావు పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని రైతులకు నిరంతరం అండగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులందరూ ఏలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదనీ రైతులకు కొండంత అండగా ఉంటామని రాజేందర్రావు భరోసా కల్పించారు. తీగల గుట్టపల్లి ఐకెపి కేంద్రంలో వర్షపు నీరు భారీగా చేరడంతో రాజేందర్ రావు తక్షణమే మున్సిపల్ సిబ్బందితో కాల్వ తీయించి నీటిని బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యం తడవకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సత్యం కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్ కుమార్, అనంతల రమేష్, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.