calender_icon.png 15 July, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ కంపెనీ పేరుతో నకిలీవి తయారు చేస్తే చర్యలు తీసుకుంటాం..

15-07-2025 12:19:07 AM

పవర్ టెక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్‌గుప్తా

ముషీరాబాద్, జూలై 14(విజయక్రాం తి): హైదరాబాద్‌లో పవర్ టెక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న బ్లేడ్లను కొంతమంది వ్యక్తులు తమ కంపెనీ పేరు తో నకీలీ బ్లేడ్లను తయారు చేసి స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నారని పవర్ టెక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్  డైరెక్టర్ మనోజ్ గుప్తా ఆరోపించారు.

సోమవారం హైదర్‌గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ శివకుమార్, ఆనంద్ అగర్వాల్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత కొంత కాలంగా విజయవాడలోని విజయశ్రీ టూల్స్ కంపెనీ నకిలీ బ్లేడ్లను తయారు చేసి తమ కంపెనీ పేరుతో విక్రయిస్తుందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు విజయవాడలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ నెల 10న పోలీసులు ఆ కంపెనీపై దా డి చేసి సుమారు రూ. 30 లక్షల విలువైన నకిలీ బ్లేడ్లను పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా తమ సంస్థ పేరు మీద ఎవరైనా నకిలీ టూల్స్ విక్రయిస్తే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ మనోజ్ గుప్తా హెచ్చరించారు.