22-05-2025 01:22:56 AM
9,990 బిల్లులు ఒకే రోజు క్లియర్
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న 9,990 బిల్లులను ఒకే రోజున క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10లక్షల లోపు బిల్లులను చెల్లించింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రభు త్వం ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు భారీగా నిధులు పెండింగ్‌లో ఉంటుండటంతో తాజాగా నిధులను విడుదల చేసింది. ఎస్‌డీఎఫ్ కింద చేపట్టిన పనులకు రూ.85 కోట్లను విడుదల చేసింది.