22-10-2025 01:06:31 AM
భారత్ ఏ జట్టు సారథిగా ఎంపిక
ముంబై, అక్టోబర్ 21 : టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఖాయమైంది. గాయంతో గత కొన్ని నెలలుగా ఆటకు దూరమైన పంత్ వచ్చే సౌతాఫ్రికా ఏ జట్టుతో సిరీస్ ద్వారా గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత్ ఏ జట్టుకు పంత్ సారథిగా వ్యవహరించనున్నాడు.ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గాయపడిన పంత్ ఆసియాకప్‌తో పాటు విండీస్‌తో సిరీస్‌కూ దూరమయ్యాడు. ఇప్పుడు గాయం నుంచి కోలుకోవడంతో పంత్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు.
అలాగే సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్ అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రేతో పాటు అన్షుల్ కాంబోజ్, బదౌనీ, యశ్ ఠాకూర్, నారాయణ జగదీశన్‌కు తొలి టెస్టుకు ఎంపికయ్యారు. అలాగే కేఎల్ రాహుల్, జురెల్, రుతురాజ్,అభిమన్యు ఈశ్వరన్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్,మహ్మద్ సిరాజ్ రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు.అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా ఏ, భారత్ ఏ జట్ల మధ్య అనధికార టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది.