calender_icon.png 26 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి

26-10-2025 05:42:22 PM

రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల

నకిరేకల్ (విజయక్రాంతి): అకాల వర్షంతో మార్కెట్లలో తడిసి ముద్దై మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, సిపిఎం మండల కార్యదర్శి రాచకొండ వెంకన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షాలకు పడిపోయినటువంటి పంట పొలాలను, తడిసిన వరి ధాన్యాన్ని రైతు సంఘం,సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షంతో పడిపోయిన వరి పొలాలకు తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తేమ శాతం కండిషన్ పెట్టకుండా కొనుగోలు చేయాలని వారు కోరారు. మార్కెట్లలో ధాన్యాన్ని జిల్లా కలెక్టర్, అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.రైతులకు వరి ధాన్యాన్ని వర్షాల నుండి భద్రపరచుటకు పట్టాలు( తార్ బాలు ) ఇవ్వాలని కోరారు. మంత్రులు, వ్యవసాయ అధికారులు, తక్షణమే క్షేత్రస్థాయిలో  పర్యటించి పరిశీలించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ  మండల కమిటీ సభ్యులు సభ్యులు అక్కెనపల్లి సైదులు, శాఖ సహాయ కార్యదర్శి అక్కెనపల్లి ఉపేందర్ ,రైతులు పల్లెబోయిన యాదయ్య, ఆకుల సత్యనారాయణ, చిట్టి పాక సైదులు, చిట్టి పాక విజయ్, శాతరాజు సైదులు, అక్కెనపల్లి ఉపేందర్ చిట్టి పాక రాములు, చిట్టిపాక ఉపేందర్, చిలుమర్తి లక్ష్మి, పిట్ట రంగారెడ్డి, ఆవుల లింగయ్య, రైతులు పాల్గొన్నారు.