calender_icon.png 26 October, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ హక్కుల సాధన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

26-10-2025 07:56:24 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): చలో ఢిల్లీ, రాజ్యాంగ హక్కు సాధన సభ వాల్ పోస్టర్ ను జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగ్ రావు ఆధ్వర్యంలో  ఆదివారం పోచారం మున్సిపాలిటీ లోని రాజీవ్ గృహకల్పలో ఆవిష్కరించారు. హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ నవంబర్ 26న జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జరగనుంది. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లి హలో మాల చలో ఢిల్లీ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క మాల బిడ్డ ఢిల్లీ నడిబొడ్డున జరిగే సభకు మాలల అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పలు నర్సింగరావు కోరారు.

ప్రతి ఒక్క మాల యువత, మహిళలు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు నడుము కట్టి అడుగేయాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని, మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో మాలల అస్తిత్వమే లేకుండా పోతుంది కాబట్టి నా మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యమకారులు యు.పి.వి. రమణ, ఓ. శ్రీనివాస్, జి బీములు, ఎన్. పుల్లయ్య, ఎ. మల్లేష్, జి. శ్రీనివాస్, కె. శ్రీనివాస్, టి. రాజు పాల్గొన్నారు.