26-10-2025 08:10:19 PM
ములకలపల్లి (విజయక్రాంతి): ములకలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ సున్నం బాబురావును పార్టీ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి ఆదివారం పరామర్శించారు. 24 గంటల కడుపు నొప్పికి ఆపరేషన్ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పరామర్శించిన మండల అధ్యక్షులు మోరంపూడి నాయకులు కొండవీటి రాజారావు, పుష్పాల చందర్ రావు, యేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.