26-10-2025 05:51:43 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ లో విప్ర్ ఫౌండేషన్ జోన్ 16 తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, లక్డీ కా పూల్ లో ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ విభాగాల్లో 90% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రతిభా అవార్డులతో సత్కరించారు. ఇందులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బి.టెక్ మొదటి సంవత్సరంలో 9.88 జీపీఏతో ఉత్తీర్ణులైన వశిష్ట్ పాండే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల షేక్ పేట్ సీవోఈ నుండి 99% మార్కులతో ఉత్తీర్ణులైన ప్రథమ్ పాండే, ఇంటర్మీడియట్‌లో 90% GPA తో ఉత్తీర్ణులైన ఛవి శర్మలను కండువా కప్పి ప్రతిభా అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్ 16 విప్ర్ ఫౌండేషన్ అధ్యక్షుడు హరికిషన్ ఓజా, మంత్రి రామ్‌దేవ్ నాగ్లా, కోఆర్డినేటర్ ఆనంద్ శర్మ లు పాల్గొన్నారు.