26-10-2025 07:59:42 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు ఇల్లందు నియోజకవర్గంలో భారీగా తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్ అన్నారు. ఆదివారం ఇల్లందు మండలంలోని 21 ఏరియాలో గడప గడపకు సిపిఐ కార్యక్రమంలో ప్రచారాన్ని విస్తృతం చేసి, విరాళాల సేకర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ పేద గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు.
డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు మండలం నుండి భారీ సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బంధం నాగయ్య, మండల పట్టణ కార్యదర్శులు బొప్పిశెట్టి సత్యనారాయణ, బాస శ్రీనివాస్, గుడిపల్లి భాస్కర్, మంచాల వెంకటేశ్వర్లు గుగులోత్ కృష్ణ, వడ్ల శీను, బసిపాక రవి, రాందాస్, తాండ్ర లక్ష్మీనారాయణ, ఆలెం రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.