26-10-2025 05:37:20 PM
హైదరాబాద్: జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ లో సీట్ పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, తదితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేటీఆర్, హరీష్ రావు శాలువతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మాజీ మంత్రివర్యులు హరీష్ రావు పూర్వ మెదక్ జిల్లాను రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారని, నిజంగా అమ్మాయిలు మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నుల్లో నీళ్ళు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని, అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకు ఉండదన్నారు.
అందులో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు తాము ఎంతో సంతోష పడుతున్నామని, ఒక జహీరాబాద్ నుండి 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు అయితున్నారని, తెలంగాణ అనేది ధాన్యము ఉత్పత్తిలోనే నెంబర్ వన్ కాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ వన్ అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, మైనార్టీ గురుకుల ఏర్పాటు చేసేటప్పుడు కేసీఆర్ ఎప్పుడూ ఏ తల్లి తండ్రి అయిన ఆడపిల్లని చదివించడానికి కులమతాలని చూపారని, మంచిది వసతులు కల్పిస్తే చదివిస్తారని అన్నారు.
మైనార్టీల కోసం నిర్మించిన పాఠశాలల్లో కొన్నింటిని ఆడబిడ్డల కోసం కూడా నిర్మించామన్నారు. ఈరోజు రైతు కుమార్తె, జర్నలిస్టు కుమార్తె, ఆటో డ్రైవర్ కుమార్తె ఎంబీబీఎస్ సీట్లు సాధించి గర్వంగా నిల్చున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీటు చదివించిన మీ అందరితో నా విన్నపం ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించాలని కోరారు. మీరు ఇంకా పేద విద్యార్థులకు సహాయం చేయండి. వారు కూడా ఉన్నత స్థాయికి వచ్చే విధంగా కృషి చేయండని అభిప్రాయపడ్డారు. గవర్నమెంట్, మీ తల్లిదండ్రులే మీమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందని, హరీష్ రావు నేతృత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు మెడికల్ కాలేజ్ లుగా ఉన్న వాటిని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా పెంచారని కేటీఆర్ చెప్పారు. ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిందని, రాజకీయాల్లోకి వెళ్లిపోవటం సహజం. మనం చేసిన మంచి పని వల్ల ఎవరికైనా మంచి జరుగుతే ఆ సంతోష చాలా గొప్పగా ఉంటుందని, మీరందరూ మీ తల్లిదండ్రుల పేర్లు, తెలంగాణ రాష్ట్ర పేర్లు నిలబెట్టాలని కేటీఆర్ ఎంబీబీఎస్ విద్యార్థులకు సూచించారు.
కాగా, ఒబేద్ తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ.. మేము ఒక్కటి నుంచి ఇంటర్మీడియట్ వరకు మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివించామని, కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు మా జీవితాలను మార్చేశాయని చెప్పారు. ఈరోజు మా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడంటే అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు.
ఒబేద్: ఎంబీబీఎస్ సీట్స్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీలకు గురుకులాలు నిర్మించి మాకు చదువు చెప్పడం మా అదృష్టం. 2016లో మైనార్టీ గురుకులాలో అడ్మిషన్ పొంది ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించామంటే అది కేసీఆర్ వల్లే, జహీరాబాద్ మైనార్టీ గురుకులాల్లో చదివిన తాసిల్ కమల్ విద్యార్థిని ఎంబీబీఎస్ సీట్ సాధించింది.
తాసిల్ కమల్ మాట్లాడుతూ.. నీట్ లో 444 మార్క్స్ వచ్చి గవర్నమెంట్ వనపర్తి లో సీట్ సాధించాను. మైనార్టీ గురుకులాల్లో మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. మేము ఎప్పటికీ కేసీఆర్ కి రుణపడి ఉంటామని, రైతు కుమార్తె ఫిర్దోస్ జహీరాబాద్ మైనార్టీ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించారు.