calender_icon.png 29 November, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతివనంపై పట్టింపేదీ?

12-02-2025 12:26:12 AM

  1. అధికారుల పర్యవేక్షణ సున్నా 
  2. ఉన్నతాధికారుల పట్టింపు కరువు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని పట్టణాల్లో, పల్లెల్లో నివసించే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి రూ. వేల రూపాయలు వెచ్చించి ప్రకృ తి వనాలను ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వ లక్ష్యం ఆచరణ లో నీరుగారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పల్లె ,పట్టణ ప్రకృతి వనాలను పరిశీలిస్తే ఎండిన మొక్కలు, పిచ్చి మొక్కలతో పరిసరాలు, అహల్లాదానికి విరుద్ధమైన వాతావరణంలో దర్శనమిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంత మైన పాల్వంచ పట్టణంలోని మంచి కంటి నగర్ హర్ష సిరి ధరణి టౌన్షిప్ నర్సరీ, పట్టణ ప్రకృతి వరాన్ని చూస్తే అధికారుల చిత్త శుద్ధి స్పష్టమవుతుంది. గత ప్రభుత్వ లక్ష్యం నీరు గారిందని చెప్పటానికి చక్కటి నిదర్శనంగా నిలి చింది.

విధులకు వచ్చామా వె ళ్ళామా అనేలా మున్సిపల్ అధికా రులు వ్యవహరిస్తున్నట్లు ఈ ప్రకృతి వనా న్ని చూస్తే స్పష్టం అవుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈ నర్సరీ ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఎంత శ్రద్ధతో విధులు నిర్వహిస్తున్నారో తేటతెల్లమవుతోంది.

పట్ట ణ ప్రకృతి వనం పై స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల నిర్ల క్ష్యంతో నర్సరీలోని మొక్కలు సైతం ఎండి పోవటం గమనార్హం. కనీసం గేటు తాళం తీసిన దాఖలాలు కూ డా కనిపించడం లేదు. వాస్తవానికి నర్సరీ లోని మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ వాటిని సం రక్షించాల్సి ఉన్నప్పటికీ ఆ ఆ దిశలో పని చేస్తున్నట్లు కనిపించడం లేదు.

ఆ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం మాట దేవుడు ఎరుగు కానీ విష సర్పాలకు నిలయంగా మారు తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కలెక్టర్ సమీపంలోని మంచి కంటి నగర్ హర్ష టౌన్షిప్‌లోని పట్టణ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి, అధికారుల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉం దని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.