12-02-2025 12:26:32 AM
* ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు రూ.35,000 రాష్ట్ర సర్కారు బాకీ పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేయాలన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.