calender_icon.png 3 July, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక దిగుబడి సాధనకు ప్రణాళికలేవి?

02-07-2025 12:00:00 AM

డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి :

* వ్యవసాయ రంగంలో దిగుమతులను భారత ప్రభుత్వం తగ్గించాలి. దేశీయ ఉత్పత్తి విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దేశ పౌరులందరికీ.. ఎంతమేరకు ఆహార ధాన్యాలు అవసరమవుతాయో అంత మేరకు రైతులు పంటలు పండించేలా ప్రణాళికలు అమలు చేయాలి. అప్పుడు ప్రభుత్వాలపై దిగుమతుల భారం తగ్గుతుంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతుంది. అనాదిగా మనది వ్యవసాయ దేశం  విభిన్న రకాల పంటలు ఇక్క పండుతాయి. పంటల ఉత్పత్తితో పాటు  భారత్ ఆయుర్వేద వైద్యానికి కూడా ప్రసిద్ధి. 

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో  భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందనేది ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకొంటారు. కానీ, దేశ ప్రజలకు అవసరాలకు తగిన స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి పెద్దగా ప్రణాళికలేవీ అమలు కావడం లేదు. మనకు అవసరమైన మేర ధాన్యాలను మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం బయటపడే మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది. 2018-- 20 సం వత్సరంలో భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 ప్రధాన వ్యవసాయ సరుకుల మొత్తం విలువ రూ.1.52 లక్షల కోట్లు. 2022--23లో అది రూ.2.82 కోట్ల కు చేరుకున్నది. 2024- -25 ఆర్థిక సంవత్సరానికి  సుమారు 3 లక్షల కోట్లకు చేరుకు న్నట్లు తెలుస్తున్నది. 

విదేశాల నుంచి దిగుమతి  చేసుకున్న సరుకుల విలువ (2024లో నవంబర్ నాటికి )

వెజిటేబుల్ ఆయిల్స్-1,22,202  కోట్లు, పప్పు ధాన్యాలు - 27,441 కోట్లు, పండ్లు -  16,092 కోట్లు, చక్కెర - 8 వేల కోట్లకు పైగానే.., సుగంధ ద్రవ్యాలు- 8,710 కోట్లు, జీడిపప్పు - 9,896 కోట్లు, సహజమైన రబ్బరు- 6,798 కోటు, నూనె గింజలు - 978 కోట్లు ..ఈ గణాంకాల ప్రకారం.. భారత్ ఒక్క 2024 సంవత్సరంలోనే 1.8 1 లక్షల కోట్ల విలువైన వ్యవసాయపరమైన సరుకులను దిగుమతులు చేసుకున్నట్టు లెక్క.

దేశంలో ఎక్కుమంది ప్రజలు వ్యవసాయ రంగంపైనా జీవిస్తారు. అన్ని రకాల పంట భూములు సౌకర్యాలు ఉండి కూడా ప్రభుత్వాలు ఆహార ధాన్యాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకుని ప్రణాళికలు, వ్యూహాలు  రచిస్తే గానీ దేశ ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు వారి దరికి చేరవు. 

పేరుకుపోయిన రైతు సమస్యలు..

ఇప్పటికే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించే ప్రయ త్నం చేయకుండా, కొత్త పథకాల పేరుతో వారిని మభ్యపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు రైతాంగానికి మద్దతు పెంచేందుకు పెద్ద పెద్ద హామీలు ఇస్తాయి. కానీ అధికారం పొంది న తర్వాత ఏర్పడే ప్రభుత్వం అసలు సమస్యలను పరిష్కరించేందుకు పూనుకోవు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాలు కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు.

అది మానవీయ విపత్తుగా మారే ప్రమా దం ఉంది. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు మౌలికపరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రైతులకు సులభమైన రీతిలో, అతి తక్కువ వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. రుణమాఫీ పథకాలను నిర్దిష్ట కాల వ్యవధిలో అమలు చేయాలి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కచ్చితంగా మద్దతు ధర ఇచ్చి తీరాలి.

మధ్యవర్తుల చేతికి మార్కెట్ వ్యవస్థను అప్పగించకుండా, ప్రభుత్వమే నేరుగా దిగుబడిని కొనే విధానాలను అమలు చేయాలి. పురోగమనం, అభివృద్ధి పేరుతో రైతుల సమస్యలను విస్మరించడం ప్రభుత్వాలకు సరికాదు. వ్యవసాయానికి ప్రాథమిక ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవస్థలను మార్చాలి. రైతులు ప్రతి దానికి సర్కా ర్‌ను ఆశ్రయించే విధంగా కాకుండా, వారి జీవితాలను వారే మెరుగుపరిచే విధంగా వ్యవసాయ రంగాన్ని పునర్నిర్మించాలి. లేనిపక్షంలో, దేశంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. 

వ్యవసాయ రంగంలో దిగుమతులను భారత ప్రభుత్వం తగ్గించాలి. దేశీయ ఉత్పత్తి విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దేశ పౌరులందరికీ.. ఎంతమేరకు ఆహార ధాన్యాలు అవసరమవుతాయో అంత మేరకు రైతులు పంటలు పండించేలా ప్రణాళికలు అమలు చేయాలి. అప్పుడు ప్రభుత్వాలపై దిగుమతుల భారం తగ్గుతుంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతుంది.

అనాదిగా మనది వ్యవసాయ దేశం  విభిన్న రకాల పంటలు ఇక్క పండుతాయి. పంటల ఉత్పత్తి తో పాటు  భారత్ ఆయుర్వేద వైద్యానికి కూడా ప్రసిద్ధి. అందుకే ఆయుర్వేద వైద్యంలో భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ప్రపంచంలో మరే ఇతర దేశంలో దొరకవంటే అతిశయోక్తి కాదు. అలాగే ప్రపంచంలోనే అత్యంత పోషక విలువలు ఉన్న పండ్లు ఇచ్చే దేశం భారత్ మాత్రమే.

ఆయుర్వేద మొక్కలు, పండ్ల తోటల పెంపకంతో ప్రభుత్వం మరింత అభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఇతర పంటలు, ఆహార ధాన్యాల అసమతుల్యతకూ ప్రభుత్వాలు చెక్ పెట్టాలి. పంటల దిగుబడులను ప్రణాళికాబద్ధగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

విదేశాల నుంచి దిగుమతులు పెరిగినా కొద్దీ.. జాతీయ  విదేశీ మారక  ద్రవ్య నిల్వల విలువలు పతన స్థాయికి చేరుకుంటాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఈ విషయాలను గుర్తెగి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుంది. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రణాళికలు అమలైతేనే ఇక ముందైనా మెరుగైన ఫలితాలు వస్తాయి. 

హరిత విప్లవ ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 

దేశంలో హరిత విప్లవాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశామని, రైతుల సమస్యలకు పరిష్కారం  చూపామని, తిండి గింజల సమస్య నుంచి బయటపడ్డామని ప్రభుత్వాలు గర్వపడుతున్నాయి. కానీ హరిత విప్లవం.. రైతులు సాగుకు ఎక్కువగా క్రిమిసంహారక మందులు ఎక్కువగా వినియోగించేందుకు కారణమైంది. ఏళ్ల పాటు రసాయనాల వినియోగం వల్ల సారవంతమైన భూములు సారాన్ని కోల్పోయాయి.

మృత్తికలో స్థూల పోషకాలు నానాటికీ పడిపోయాయి. ఆ దుష్పరిణామాలు పంటల దిగుబడిపైనా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వ్యవసారంగా నిపుణుల సాయం తీసుకోవాలి. రసాయన మందుల వినియోగం అమాంతం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. పెస్టిసైడ్ వినియోగం ఒక్క దిగుబడులను మాత్రమే కాదు.. ఆ భూముల్లో పండిన ఆహార పదార్థాలు తిని మనుషులు తమ ఆయుష్షును సైతం తగ్గించుకుంటున్నారు.

చిన్నతనంలోనే లేనిపోని అనారోగ్యాల బారినపడుతున్నారు. పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తిని పిల్లలు కూడా శక్తిమంతులు కాలేకపోతున్నారు. రసాయన పూరితమైన ఆహారం తిని మరింత బలహీనపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం.

ప్రభుత్వాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. వ్యవసాయదారులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయాలు, సూచనలు.. సలహాలు తీసుకుని వాటిన తప్పకుండా అమలు చేయాలి. నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. రైతులు ఏటా భూసార పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలి. 

వ్యవసాయంలో పూర్తిగా సేంద్రియ, ప్రకృతి సేద్యాలను అమలులోకి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేంద్రియ వ్యవసాయానికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయడానికి పూనుకున్నదంటే అది గొప్ప విషయంగా భావించాలి.

అలాగే ప్రభుత్వం శాస్త్రీయమైన పద్ధతులను రైతులకు పరిచయం చేయాలి. యంత్రాంగం ఆ సాగుపై పక్కా గా పర్యవేక్షణ చేయాలి. రైతాంగాన్ని ఆ మేరకు చైతన్యపరచగలగాలి. రైతులు కాయకష్టం చేసుకుని పనిచేసేవారు. వారి కోసం చిత్తశుద్ధి ప్రభుత్వ పథకాలు అమ లు చేయాలి. లేకుంటే పరిమితికి మించి దిగుమతుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయే ప్రమాదం ఉంది.