22-05-2025 12:43:21 AM
కమల్‌హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘థగ్‌లైఫ్’. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్ సుధాకర్‌రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘షుగర్ బేబీ’ రిలీజ్ అయ్యింది. ‘ఏం కావాలి నీకు.. కొద్దికొద్దిగడుగు.. ఇంకేంకావాలి నీకు.. స్వర్గం తేనా ఇలకు’ అంటూ సాగుతోందీ పాట. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.