calender_icon.png 25 May, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తలవాడిలో..

22-05-2025 12:44:45 AM

కన్నడ స్టార్ యశ్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ పీఏ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఆమె నిర్మాతగా  రూపొందించిన తొలిచిత్రం ‘కొత్తలవాడి’. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తుండగా గోపాల్ దేశ్‌పాండే, రాజేశ్ నటరంగ, అవినాష్, కావ్యశైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ ఇతర పాత్రల్లో నటించారు. సిరాజ్ రచనాదర్శకత్వం వహిస్తున్నారు. 

మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. ‘కొత్తలవాడి’ అనేది కర్ణాటక రాష్ట్రం లో ఓ గ్రామం. సినిమా ఎక్కువ భాగాన్ని అక్కడ చిత్రీకరించారు. కథాపరంగా స్థానికత, మూలాల్లో సహజత్వం కోసం స్థానిక యాసను సంభాషణల్లో ఉపయోగించారు. వికాస్ వశిష్ట పాటలకు స్వరాలు సమకూర్చితే, అభినందన్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రఘు నీనందల్లి మాటలు రాశారు.