calender_icon.png 6 November, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తృతీయ వనమహోత్సవం దిగ్విజయం చేయండి

06-11-2025 05:01:00 PM

నేరేడుచర్ల (విజయక్రాంతి): కాకతీయ కమ్మవారి సంఘం నేరేడుచర్ల ఆధ్వర్యంలో నవంబర్ 9న ఏ వన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోవు మూడవ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని గరిడేపల్లి నేరేడుచర్ల పాలకీడు మండలాల కమ్మ బంధువులందరూ వందలాదిగా తరలివచ్చి దిగ్విజయం చేయాలని కాకతీయ కమ్మ వారి సంఘం నిర్వహణ కమిటీ అధ్యక్షులు యారవ సురేష్ విజ్ఞప్తి చేశారు. పవిత్ర కార్తీక మాసములో నిర్వహించే ఉసిరి చెట్టు దీపోత్సవ పూజలతో ప్రారంభమై అతిధుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆత్మీయుల సాఫంతి భోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.