06-09-2025 05:46:41 PM
మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ గణేష్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిసాయని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. గణేష్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా శనివారం రోజు కొత్తపల్లి, మానకొండూర్, చింతకుంట నిమజ్జనం పాయిట్లను సందర్శించి... గణేష్ నిమజ్జనాలను పర్యవేక్షించారు. నిమజ్జనం పాయిట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తూ పారిశుధ్య తదితర పనుల పై ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... కరీంనగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంత వాతావరణం ముగిసాయని తెలిపారు. చిన్న నుండి భారీ విగ్రహాలు వరకు అన్ని విగ్రహాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేశామని తెలిపారు. నిమజ్జనం పాయింట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీస్కున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు కార్మీకులు పారిశుధ్య పనులు చేపడుతూ.... నీరు చెత్త చెదారతో పాటు ప్లాస్టిక్ వస్తువులు, విగ్రహాల్లో వాడే రాజు కర్రలను తొలగించి వేయడం జరగిందని తెలిపారు. అంతే కాకుండా నిమజ్జనం పాయింట్ల వద్ద కూడ ఎలాంటి చెత్త లేకుండ చర్యలు తీస్కోవాలని అధికారలను ఆదేశించినట్లు తెలిపారు.