calender_icon.png 22 December, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైథలాజికల్ రూరల్ డ్రామా వానర

21-12-2025 12:02:43 AM

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. ఈ చిత్రంలో సిమ్రా న్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్  బుయానీ, ఆలపాటి రాజా, సీ అంకిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ శనివారం విడుదల చేసిన పోస్టర్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్: వివేక్ సాగర్; డీవోపీ: సుజాత సిద్ధార్థ్; ప్రొడక్షన్ డిజైన్: నార్ని శ్రీనివాస్; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్.