14-05-2025 12:16:38 AM
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సమాంతర ప్రపంచం, పునర్జన్మ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా అగ్ర నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నటుట తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు ఇటీవలే ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో లుక్ టెస్ట్ నిర్వహించారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. సెకండ్ లుక్‌టెస్ట్ కూడా జరగనుంది. రెండో పరీక్ష కూడా ముంబయిలోనే ఉండనుంది. ఈ టెస్ట్‌లో అల్లు అర్జున్ లుక్స్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నట్టు తెలుస్తోంది. ఒక లుక్‌లో హెవీ ప్రోస్థటిక్స్ మేకప్ ఉపయోగించనున్నట్టు సమాచారం.
పాత్రకు తగ్గట్టు భిన్నమైన మేకోవర్‌లను ప్రయత్నిస్తూ నటనకు కొత్త ఒరవడి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ లుక్ టెస్ట్‌లు చేపడుతున్నారట. ఇందులో అల్లు అర్జున్ మల్టిపుల్ గెటప్స్‌లో కనిపించబోతున్నారని టా క్. ఇదిలా ఉండగా బన్నీ గురించి ఇప్పుడు మరో ఆసక్తికర వార్త కూడా వినవస్తోంది. అదేంటంటే.. అట్లీ సినిమా పనిమీద ముంబయి వెళ్లిన బన్నీని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ కలిశారు.
ఇది పూర్తిగా ప్రొఫెనల్ మీటింగ్ అని, ఆమిర్‌ఖాన్ తన ‘మహాభారతం’ ప్రాజెక్ట్ కోసమే అల్లు అర్జున్‌ను కలిశారని బీటౌన్ టాక్. ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో తానే నటిస్తానని గతంలోనే ప్రకటించిన ఆమీర్.. అర్జునుడిగా బన్నీని చూపించాలని భావిస్తున్నారట! అందుకే ఆయన అల్లు అర్జున్‌ను కలిశారట. మొత్తం ఐదు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా తొలి భాగానికి సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తారట.
ఇందులోని మరికొన్ని పాత్రల కోసం దక్షిణాది నుంచి స్టార్ హీరోలను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగవంశీ కాంబోలో కూడా ఓ పౌరాణిక చిత్రాన్ని మేక ర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనికన్నా ముందు ‘మహాభారతం’లోనే అల్లు అర్జున్‌ను పౌరాణిక పాత్రలో చూసే అవకాశం వస్తుందా? అంటే ఆమిర్‌ఖాన్ స్పీడ్ చూస్తే అలానే అనిపిస్తోందంటోంది సినీలోకం.