26-09-2024 12:00:00 AM
రాష్ట్రంలో 11062 టీచర్ పోస్టులకు ఈ ఏడాది జులై 18నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసి మూడు నెలలైనా , ఫైనల్ కీ విడుదల చేసి 20 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. డీఎస్సీ పరీక్షలపై నాన్చివేత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలు ఉన్నారు.
వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనను విద్యాశాఖ ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు.
రావుల రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్.