తాగునీటి సమస్య తీర్చాలని డీసీకి ఫిర్యాదు
మేడ్చల్ అర్బన్, జూన్ 15 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ 298వ డివిజన్ పరిధిలోని అత్వెల్లి ప్రాంతంలో 1,2,3వ వార్డులలో త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని మునిసిపల్ మాజి కౌన్సిలర్ లు శ్రావణ్ కుమార్ గుప్తా జాకట దేవరాజ్.నారెడ్డి రవీందర్ రెడ్డిలు మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పాత అత్వెల్లి పట్టణంలోని రాధవేంద్ర నగర్ కాలనీలతో పాటు సమీపంలోని వివిధ కాలనీలలో త్రాగునీటి సరఫరా సక్రమంగా జరుగక పోవడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని మాజి కౌన్సిలర్ లు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని అత్వెల్లి ప్రాంతంలో 1,2,3 వ వార్డులలో త్రాగునీటి సరఫరాను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజి మున్సిపల్ కౌన్సిలర్ లు జాకట దేవరాజు.శ్రావణ్ కుమార్ గుప్తా లు డిప్యూటీ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారెడ్డి కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






