27-12-2025 12:00:00 AM
చిన్నంబావి, డిసెంబర్ 26 : దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు,విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హాస్టల్ వెల్పేర్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.
ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్నప్రాంతాల్లో దోమలను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మురికినీరు, నిల్వ ఉన్న నీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని వలన లార్వాలు పెరిగి దోమలు ప్రభలుతాయన్నారు.దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తాయన్నారు.దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని ప్రజలకు సూచించారు.