20-09-2025 12:00:00 AM
మంగపేట, సెప్టెంబరు 19 (విజయక్రాంతి): అలంకార ప్రాయంగా సామూహిక మరుగుదొడ్లు అనే వార్త ఈనెల 12న ప్రచురుతమైంది.గ్రామపంచాయతీ కార్యదర్శి మా సిబ్బందితో నీటి వసతిని కల్పిస్తూ డ్రైనేజీలలో బ్లీచింగ్ చలిస్తానని వివరణ ఇచ్చారు ఆ మాట ఉత్తి మాటగానే ఉండిపోయింది. ఈ వార్తకథనానికి స్పందించని గ్రామపంచాయతీ అధికారుల పనితీరు చూస్తేఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.
గ్రామ పంచాయతీలలో కొన్ని ఏళ్ల నుంచి సర్పంచ్ లు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు వారు ఆడింది ఆట పాటిందే పాటగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పత్రికలకు స్పందించని గ్రామ పంచాయతీ అధికారులు పై అధికారి నిర్ణయానికి మాటలకైనా కట్టుబడి ఉంటార అనే సందేహంలో గ్రామ ప్రజలు మంగపేట గ్రామ పంచాయతీ అధికారుల పని తీరు గిట్లనే ఉంటది అంటున్న మరికొందరు.
ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న సామూహిక మరుగుదొడ్లును ఉపయోగంలోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.