calender_icon.png 13 September, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షమీ తడాఖా

10-12-2024 12:27:47 AM

  1. భారత స్టార్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
  2. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్, యూపీ
  3. యూపీని గెలిపించిన రింకూ సింగ్
  4. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ

బెంగళూరు: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. టోర్నీలో బెంగాల్ తరఫున ఆడు తున్న షమీ జట్టు క్వార్టర్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. చిన్నస్వామి వేదికగా జరిగిన తొలి ప్రిక్వార్టర్స్‌లో ఛండీగర్‌పై 3 పరుగుల తేడాతో బెంగాల్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి న బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

కరన్ లాల్ (33) రాణించగా.. ఆఖర్లో మహ్మద్ షమీ (17 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఛండీగర్ తరఫున జగ్జిత్ సింగ్ 4 వికెట్లతో రాణించగా.. రాజ్ బవా రెండు వికెట్లు తీశా డు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఛండీగర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి విజయానికి కేవలం 3 పరుగుల దూరంలో నిలిచింది. రాజ్ బవా (32), ప్రదీప్ యాదవ్ (27) పర్వాలేదనిపించారు. బెంగాల్ బౌలర్లలో సయాన్ ఘోష్ 4 వికెట్లతో చెలరేగగా.. కనిశ్క్ సేత్ 2, షమీ, షాబాజ్ అహ్మద్ చెరొక వికెట్ తీశారు.

బుధవారం జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు బరోడాను ఎదుర్కోనుంది. జాతీయ జట్టులోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోన్న మహ్మద్ షమీ దేశవాలీ టోర్నీల్లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు కలిపి 64 ఓవర్లు బౌలింగ్ వేసిన షమీ 16 వికెట్లు పడగొట్టాడు. 

రింకూ క్లాస్.. విప్రజ్ మాస్

మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్ 4 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయాన్ని అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశికాంత్ (23 నాటౌట్) రాణించాడు.

ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు. 157 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఉత్తర్ ప్రదేశ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరన్ శర్మ (48) రాణించగా.. ఆఖర్లో రింకూ సింగ్ (27*), విప్రజ్ నిగమ్ (27*) జట్టును గెలిపించారు. ఆంధ్ర బౌలర్లలో సుదర్శన్ 3 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్స్‌లో యూపీ జట్టు ఢిల్లీని ఎదుర్కోనుంది.