calender_icon.png 15 October, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషమించిన విశ్రాంత ఉపాధ్యాయుడి ఆరోగ్యం

15-10-2025 12:27:50 AM

అయినా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ 

గండీడ్, అక్టోబర్ 14: ఉపాధ్యాయుడు కావాలన్న బలమైన కోరికతో కస్టపడి చదివి  ఉద్యోగం సాధించి 25 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించిన  విశ్రాంత ఉపాధ్యాయుడికి ప్రభుత్వం రిటైర్మెంట్ బెని ఫిట్స్ అందలేదు. గండీడ్ మండలం కొంరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కుడుముల కొండయ్య  అదే మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో   పనిచేస్తూ  గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో రిటైర్మెంట్ కావటం జరిగింది.

ఇప్పటికి 13 నెలలు  గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు  అందలేదు. కొండయ్య   ఊపిరితిత్తుల  సంబంధిత సమస్యతో బాధపడుతూ హాస్పిటల్‌కి వెళ్లగా EHS  కూడా వర్తించలేదు. ఒక సంవ త్సరం నుంచి  అప్పులు చేసి హాస్పిటల్ లో  ఖర్చు   పెడ్తున్నాడు . కానీ గత వారం నుంచి కొండ య్య పరిస్థితి విషమించింది.

ఆక్సిజన్ సపోర్ట్ తో ప్రస్తుతం దీన స్థితిలో ఉండటం చేత కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల  ఆందోళనగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండ య్యకి రావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలనీ కుటుంబ సభ్యులు  కోరుతున్నారు.