25-10-2025 12:00:00 AM
మహిళల వన్డే ప్రపంచకప్
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. కీలకపోరులో అన్ని విభాగాల్లోనూ దుమ్మురేపిన భారత్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ చేరుకోగా... నాలుగో జట్టు గా భారత్ చివరి బెర్తును దక్కించుకుంది. ఇ ప్పుడు సెమీస్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరనేది శనివారం తేలుతుంది. టోర్నీ రూల్స్ ప్రకా రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తొలి సెమీస్ ఆడుతుంది. ప్రస్తుతం ఆసీస్ 11 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా 2,3 స్థానా ల్లో కొనసాగుతున్నాయి.
శనివారం ఆసీస్, సౌతాఫ్రికా తలపడనుండగా.. దీనిలో కంగారూలు గెలిస్తే టాప్ ప్లేస్ తోనే లీగ్ స్టేజ్ ను ముగిస్తారు. అప్పుడు ఆసీస్‌తోనే భారత్ సెమీస్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే ఆ జట్టుతో సెమీఫైనల్లో తలప డాల్సి ఉంటుంది. మొత్తం మీద భారత్ సెమీ స్‌లో ఎవరితో తలపడుతుందనేది శనివా రం తేలిపోనుంది. భారత మహిళల జట్టు చి వరి మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై గెలిచినా 8 పా యింట్లతో నాలుగో ప్లేస్ లోనే ఉంటుంది.