25-10-2025 12:00:00 AM
క్లీన్ స్వీప్
కుల్దీప్ కు ఛాన్స్ ఇస్తారా ?
సిడ్నీ, అక్టోబర్ 24 : భారీ అంచనాలతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన టీమిండియా వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయింది. పెర్త్ , అడిలైడ్ వేదికలుగా జరిగిన రెండు వన్డేల్లోనూ ఓటములు చవిచూసి ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం ముంగిట నిలిచింది. సిడ్నీ వేదికగా జరగబోయే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరో వైపు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని జారవిడుచుకోకూడదని ఆసీస్ పట్టుదలగా ఉంది.
భారత్ చివరి సారిగా 2021లో వరుసగా మూడు వన్డేల్లో ఓడిపోయింది. నిజానికి ఈ పర్యటన కోసం కొత్త కెప్టెన్ గా శుభమన్ గిల్ ఎం పికవడం, కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కంగారూలపై గత కొంతకాలంగా ఆధిపత్యం కనబ రుస్తున్న భారత్ మరోసారి అదరగొడుతుందేమోనని అనుకున్నారు.
కానీ స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ విఫలమవడం, బౌలింగ్ కాంబినేషన్‌లో ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడం భారత్ వరుస ఓటములకు కారణమైంది. అలాగే తుది జట్టు కూ ర్పులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా మైనస్ గా మారింది. ఈ నే పథ్యంలో క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలంటే సిడ్నీలో భారత్ సమిష్టిగా రా ణించాల్సిందే.
గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. అలాగే అక్షర్ ప టేల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయి తే కెప్టెన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రం పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నా రు. ముఖ్యంగా కోహ్లీ వరుసగా రెండు మ్యా చ్‌లలోనూ డకౌటయ్యాడు. దీంతో సిడ్నీలోనైనా కింగ్ చెలరేగాలని అభిమానులు కోరు కుంటున్నారు.
ఈ మ్యాచ్ ఆసీస్ గడ్డపై కోహ్లీ కి చివరిది కావొచ్చు. అందుకే విరాట పర్వం చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అ లాగే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నా కూడా కోహ్లీ ఈ మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే. మరోవైపు బౌలింగ్ కాంబినేషన్ లో మార్పులు జరుగుతాయా లేదా అనేది చూడాలి. తొలి రెండు వన్డేల్లోనూ కుల్దీప్ లేకపోవడం భారత్ విజయావకాశాలపై ప్రభావం చూపింది.
తొలి మ్యాచ్ తర్వా తైనా గంభీర్ అతన్ని తీసుకుంటానుకుంటే అదీ జరగలేదు. దీంతో ఆడమ్ జంపా 4 వికె ట్లు తీసిన చోట మన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. మరి సిడ్నీ వన్డేలోనైనా కుల్దీప్ ను ఆడిస్తారో లేదో చూడాలి. అలాగే సిరాజ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తుండగా.. అర్షదీప్, హర్షిత్ రాణా అతనికి సపో ర్ట్‌గా ఉన్నారు. అర్షదీప పర్వాలేదనిపిస్తు న్నా... హర్షిత్ రాణా మాత్రం ఇప్పటి వరకూ ఆకట్టుకోలేదు. గంభీర్ శిష్యుడు కావడంతోనే జట్టులో ఉంటున్నాడన్న విమర్శల నేప థ్యంలో అతను తన సత్తా నిరూపించుకోవాల్సిందే.
మరోవైపు ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నే సింది. గత రెండు మ్యాచ్‌లలో జోరునే కొనసాగించి 3-0తో సిరీస్ కంప్లీట్ చేయాలని ఎదురుచూస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఫామ్‌లో లేకున్నా... షార్ట్ , రెన్షా, కూపర్ కన్నోలీ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ఆడమ్ జంపాతో పాటు పేసర్లు స్టార్క్, హ్యాజిల్ వు డ్, ఎల్లిస్ అదరగొడుతున్నారు. కాగా సిరీస్ ఇప్పటికే గెలిచేసిన నేపథ్యంలో స్టార్క్, హ్యాజిల్ వుడ్ కు రెస్ట్ ఇచ్చే ఛాన్సుంది.
గత రికార్డులు :
ఇదిలా ఉంటే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ రికార్డ్ చెత్తగా ఉంది. ఇక్కడ ఆసీస్ తో 19 మ్యాచ్ లలో తలపడితే కేవలం రెండుసార్లే గెలిచింది. 16 మ్యా చ్ లలో ఓడిపోతే 1 మ్యాచ్ ఫలితం రా లేదు. 2016 తర్వాత సిడ్నీలో ఒక్క మ్యా చ్ కూడా భారత్ గెలవలేదు.
పిచ్ రిపోర్ట్ :
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఎక్కువగా బ్యాటర్లు ఆధిపత్యం కనిపిస్తుంటుంది. హై స్కోర్లు నమోదవుతుండడంతో బౌలర్లకు కాస్త ఇబ్బందే. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువసార్లు గెలిచాయి. మ్యాచ్ సాాగే కొద్దీ స్పిన్నర్లు కీరోల్ ప్లే చేసే అవకాశముంది.
భారత తుది జట్టు (అంచనా):
గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, సిరాజ్, అర్షదీప్, హర్షిత్ రాణా/ ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా) :
మిఛెల్ మార్ష్ (కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్షా , క్యారీ, కూపర్ కన్నోలీ, మిఛ్ ఓవెన్, బార్టోలిట్, స్టార్క్/ఎడ్వరడ్స్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్/ హ్యాజిల్ వుడ్