calender_icon.png 18 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్ నడిపేది ఇక లోకేశే..?

18-05-2025 12:29:52 AM

ఏపీ రాజకీయాలు ఎప్పు డూ ఆసక్తికరమే. అక్కడి పార్టీలకు విపరీతమైన ప్రచారం చేసేందుకు పత్రికలు, సోషల్ మీడియా లు చాలా బలంగా పనిచేస్తుంటా యి. ఇప్పుడు అక్కడ ఒక్క టాపిక్ బాగా నడుస్తోంది. లోకేశ్‌కు త్వరలోనే ప్రమోషన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన క్యాబినెట్‌లో కీలకమైన మంత్రిగా ఉన్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా లోకేశ్‌ను మరింత ఉన్నత స్థానంలో చూడాలని తాము భావిస్తున్నట్లు సైకిల్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ మధ్య ఓ మంత్రి టీడీపీ భవిష్యత్ లోకేశే అని..భవిష్యత్‌లో సీఎం ఆయనే అని నిర్ణయించేశారు. మరో నేత లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలన్నారు.

ఇవన్నీ నడుస్తుండగానే లోకేశ్ త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ఎక్కువ మంది అంటున్నారు. పార్టీలో టాక్ కూడా బాగానే నడుస్తోంది. కొద్దిరోజుల్లో పార్టీ మహానాడు జరుగనున్నది. ఈ కార్యక్రమంలో లోకేశ్‌కు ప్రమోషన్ వస్తుందని తెలుగు తమ్ముళ్లు నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి సైకిల్ బాస్ మదిలో ఏముందో?.

 తమ్మనబోయిన వాసు