18-05-2025 12:31:29 AM
కొన్ని రోజులుగా గులాబీ పార్టీలో గుసగుసలు ఎక్కువయ్యాయి. పార్టీ రజతోత్సవ సం బురం తర్వాత ఈ గుసగుసలు మరింత పుంజుకున్నాయి. మొత్తానికైతే పార్టీలో ఏదో జరుగు తోంది? అనే చర్చ లీడర్ నుంచి క్యాడర్ దాకా సాగుతోంది. కారు పార్టీ కీలకనేత కవిత ఇటీవల చేసిన కామెంట్లు పార్టీలో కాకరేపాయి.
తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆర్నెల్లు జైల్లో ఉన్నా సరిపోలేదా.. అంటూ చేసిన వ్యా ఖ్యలు పార్టీలోనూ, బయట వేడిపుట్టించాయి. ఈ చర్చ నడుస్తుండగానే కేసీఆర్ చెప్తే కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఓకే అని మరో అగ్రనేత హరీశ్‌రావు ప్రకటించడం పార్టీలో చర్చ మరింత పెరిగింది.
గులాబీ పార్టీలో నాయకత్వ అంశం రాజు కుంటోందని అందరికీ అర్థమవుతూనే ఉంది. హరీశ్‌రావు ప్రకటన తర్వాత ఇక బీఆర్‌ఎస్ బాస్‌గా కేటీఆర్‌కు లైన్‌క్లియర్ అయ్యిందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. కారుకు డ్రైవర్ రాముడే అంటూ.. పార్టీ క్యాడర్ సైతం ఓ క్లారిటీకి వస్తున్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యల తర్వాత ఆయన ఇంటికి కేటీఆర్ పోవడంతో నాయకత్వమార్పుపై రాజకీయవర్గాల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించినట్లుంది.