28-10-2025 12:00:00 AM
-జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్
-రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ..నవంబర్ 24న కొత్త సీజేఐ ప్రమాణం?
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత 53వ ప్రధాన న్యాయమూర్తి చాన్స్ ఎవరిని వరించనుందో...? అయితే.. తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. సీజేఐ పదవీ విరమ ణకు నెల రోజుల మందుగా తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐ నియా మకం కోసం కేంద్రం ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది.
సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ ను ఈ పదవి వరిస్తుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్‌గా ఉన్నా రు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమో దం లభిస్తే 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణం చేయ నున్నారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హి స్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
హరి యాణాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 1984లో న్యాయవాదిగా హరియాణాెేపంజాబ్ హై కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తి, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. ఆయన ఇటీవల నల్సా(నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) కార్యనిర్వాహక చైర్మన్‌గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కన్పిస్తుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు.