calender_icon.png 6 July, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

06-07-2025 12:13:13 AM

  1. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు..

భారీర్యాలీగా పార్టీ కార్యాలయానికి..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివా రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ మీడి యాతో మాట్లాడుతూ..పార్టీ అభివృద్ధికి పనిచేసిన అందరికీ చక్కని అవకాశాలు లభిస్తా యన్నారు. బీజేపీని నమ్ముకున్నవారిని ఎ ప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు.

అనంతరం గన్‌పార్క్ వద్దకు చేరుకుని అమర వీరుల స్థూ పానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాలలు వేసి  నివాళులు అర్పించిన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించారు.

కేంద్రమంత్రి, పార్టీ మాజీ అధ్యక్షు డు కిషన్‌రెడ్డి నూతన అధ్యక్షున్ని కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఎంపీ లు డీకే అరుణ, ఈటల రాజేం దర్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పార్టీ నేతలు బూర నర్సయ్యగౌడ్, మురళీధర్‌రావు, ఎన్వీ సుభాశ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాణీరుద్రమ తదితరులు కొత్త అధ్యక్షుడిని అభినందించారు