calender_icon.png 31 December, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు మండలాలపై మంత్రి సీతక్కకు ఎందుకు ఇంత చిన్నచూపు

30-12-2025 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 29( విజయక్రాంతి): మంత్రి సీతక్క తలుచుకుంటే రెండు మండలాల అభివృద్ధి ఎంత అని ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు వ్యాఖ్యనించారు.అధిక ఇసుక క్వారీలకు అనుమతులు నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. ములుగు జి ల్లా వెంకటాపురం మండలంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో అధికంగా ఇసుక క్వారీలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ క్రమంలో వెంటనే ఇసుక క్వారీలకు అనుమతులు నిలిపివేయాలని మంత్రి సీతక్కకు ఆయన విన్నపం చేశారు. ఇసుక క్వారీల వల్ల గ్రామాల మధ్య కలిసిమెలిసి ఉన్న పరిస్థితుల్లో చిచ్చు పెట్టేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయని తోట మల్లికార్జున రావు పేర్కొన్నారు.

ఇసుక రవాణా కారణంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు, ప్రజల దై నందిన జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆయన తెలిపారు.అదేవిధంగా వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లాలంటే సుమారు ఐదు గంటల సమయం పడుతోందని, ఇది రోడ్ల దుస్థితికి నిదర్శనమని అన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రయాణం కష్టసాధ్యంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటాపురం, వాజేడు మండలాలపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించి ఒకసారి స్వయంగా పరిశీలిస్తే, రెండు మండలాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉందని తోట మల్లికార్జున రావు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి పరిష్కరిస్తే ప్రజలు పార్టీ పేరును గౌరవంతో చెప్పుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తులు, ఇసుక క్వారీల నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున రావు విజ్ఞప్తి చేశారు.