13-10-2025 01:06:23 AM
-ఒక్కో సభ్యుడి నుంచి పదుల సంఖ్యలో సంతకాలు పెట్టించుకుంటున్న కన్వీనర్!
-సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై రెండు నెలల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు
-మంచిర్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘంలో కొత్త మలుపు
మంచిర్యాల, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమి క కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయ ని పలువురు ఆరోపిస్తున్నారు. రెండు నెలల కిందట ఓ సభ్యుడు సంఘంలో జరుగుతు న్న అక్రమాల మీద ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
దీంతో అక్రమాలను కప్పి పుచ్చేందుకు సభ్యులను రోజు పిలిపించుకొని పదుల సం ఖ్యలో సంతకాలు తీసుకుంటున్నారు.. ఈ సంతకాలు ఎందుకు..? అనేది కూడా సభ్యులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు సంఘంలోని ఓ సభ్యుడు తన ఇలాఖాలో ఇలా సంతకాల సేకరణ చేస్తున్నట్లు సమాచారం. సొసైటీకి ఇంత వరకు ఆడిట్ చేయించని ఆ పెద్ద మనిషి హుటాహుటిన కొత్త అ వతారం ఎత్తి అందరితో సంతకాలు చేయిస్తున్నాడు. గీత పారిశ్రామిక సహకార సంఘా నికి 2015 నుంచి ఆడిట్ జరుపనున్నట్లు అధికారిక సమాచారం.
విచారణలో ఈ సంఘానికి అసలు ఆడిట్ జరుగడం లేదని, ఒకరు కొందరిని దగ్గర పెట్టుకొని లక్షలు కొల్లగొడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. కన్వీనర్ పేరిట రూ. 2.80 లక్షలు ఎందుకు తీసుకుంటున్నారు.. ఎవరి లబ్ధికోసం ఈ డబ్బులు వెచ్చిస్తున్నారో వివరాలు కావాలని సభ్యుడు నిలదీయడంతో డొంక కదలుతోం ది. చేసేదేమి లేక సదరు వ్యక్తి గడిచిన రెండు రోజులుగా సంఘంలోని అధికారిక 39 మం ది సభ్యుల సంతకాలు తీసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. కొత్త రిజిష్టర్లలో గతంలో సమావేశాలు నిర్వహించకున్నా, నిర్వహించినట్లు సమావేశ కాపీల్లో సంతకాలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
రెండు రిజిష్టర్ల (పసుపు రంగు, తెలుపు రంగు)లో ఒక్కో సభ్యుడితో సుమారు 30 నుంచి 40 వరకు సంతకాలు తీసుకుంటుండ్రు. అసలు విషయమేమంటే చదువురాని చాలా మంది కి ఎందుకు పెడుతున్నామో కూడా తెలియదని, పెద్దాయన పెట్టమంటే పెట్టామనే స మాధానం ఇస్తున్నారు. కొందరికే సొసైటీ లెక్కలు రాసి పెట్టాం, అందరి సంతకాలు కావాలని చెబుతుంటే.., మరి కొందరికేమో పాత సంఘం గడువు దాటింది కొత్త సం ఘం కోసం అని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెబుతూ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇన్ని రోజులు లేని ఈ సంతకాలెందుకని పలువురు సభ్యులు మాట్లాడు కుంటున్నారు.