calender_icon.png 13 October, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛందంగా శ్రమదానం చేయండి

13-10-2025 01:05:00 AM

ఉపకులపతి, ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ 

పాలమూరు యూనివర్సిటీ, అక్టోబర్ 12: ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనాలని ఉపకులపతి, ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ పరిపాల భవన సమీపంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1,5, 8  ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక క్యాంపు అయిదవ రోజుకు చేరుకున్నది.ఈ సందర్బంగా పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి  ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ పాలమూరు విశ్వవిద్యాలయం పి రమేష్ బాబు  క్యాంపులను సందర్శించి  ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ తో మాట్లాడారు.

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ సమాజసేవ చేయడము అలవర్చుకోవాలన్నారు గ్రామాలలో బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, బడికి రాకుండా ఉన్నటువంటి పిల్లలు, బాల కార్మికులు లాంటి సమస్యలు గ్రామాలలో ఎక్కువగా ఉన్నాయన్నారు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ పై సమస్యలపై గ్రామ ప్రజలను నాటకాల రూపంలో చైతన్య పరచాలని తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో, పరీక్షల నియంత్రణ అధికారి & ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కే ప్రవీణ, డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్ డాక్టర్ ఎన్ చంద్ర కిరణ్, వైస్ ప్రిన్సిపల్ న్యాయ కళాశాల డాక్టర్ భూమయ్య, డాక్టర్ బృందాదేవి, డాక్టర్ ప్రదీప్ ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎస్ రవికుమార్ డాక్టర్ శివకుమార్ సింగ్ డాక్టర్ జ్ఞానేశ్వర్, అధ్యాపకులు  డాక్టర్ రామ్మోహన్, అయేషా హస్మి  ల్యాబ్ అసిస్టెంట్స్ రఘు, సత్యం, అనిత యాదయ్య ఆఫీస్ అసిస్టెంట్, 150 ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్  పాల్గొన్నారు.