calender_icon.png 11 July, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీలకు అండగా ఉంటా

16-07-2024 01:54:53 AM

  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
  • వనస్థలిపుంలో పద్మశాలీల సన్మాన సభ 

ఎల్బీనగర్, జూలై 15: పద్మశాలీలకు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశాలీలతో తనకు 24 ఏళ్లుగా అనుబంధం ఉన్నదన్నారు. పద్మశాలీల సమస్య లపై తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. తనకు కులం, మతంతో సంబంధంలేదని, ప్రజలకు మేలు కోసం అండగా ఉంటానని చెప్పారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పద్మాశాలీ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.