01-09-2025 01:25:44 AM
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ, ఆయన తల్లిపై అనుచిత వాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలకు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు.
ఈ మేరకు ఆదివారం బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్ ఆధ్వర్యంలో ప్రాగాటూల్స్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅథితిగా హాజరైన భరత్ గౌడ్ మాట్లాడుతూ... రాహు ల్ గాంధీకి రాజకీయాలు తప్ప, భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు తెలియవని, అందువల్లే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కేవలం రాజకీయ లబ్దికోసమే బీజేపీ అగ్రనేతలపై తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్పా ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్ష కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దేశ ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, కార్పొరేటర్లు రవిచారి, సుప్రి యా నవీన్ గౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజశేఖర్, కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు గడ్డం నవీన్, కృష్ణ, నందగిరి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.