calender_icon.png 8 September, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య కార్మికుల నష్టం కలిగించే జీవో రద్దు చేయాలి

08-09-2025 05:02:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో చేపల వృత్తే జీవనాధారంగా బతుకుతున్న మత్స్య కార్మికులకు హాని కలిగించే జీవోను వెంటనే రద్దు చేయాలని గంగపుత్రుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం నిర్మల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి మత్స్యకార సొసైటీలో ఇతర వృత్తి వారిని చేపల పెంపకానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన చేప కార్మికులకు ఉపాధి కల్పించాలని 98 జీవోను వెంటనే సవరించాలని అన్ని చేపల చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జింక లక్ష్మీనారాయణ చిన్నయ్య గంగాధర్ రాజేష్ బసవరాజ్ తదితరులు ఉన్నారు