calender_icon.png 6 May, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ క్యారేజ్ అవుతుందా?

04-05-2025 12:00:00 AM

మిస్ క్యారేజ్ ఎక్కువగా మొదటి మూడు నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు మిస్ క్యారేజ్ కు కచ్చితమైన కారణాన్ని గుర్తించడం కష్టం. కానీ మిస్ క్యారేజ్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

మొదటి మూడునెలల్లో 50 శాతం కంటే ఎక్కువ మిస్ క్యారేజ్‌లు క్రోమోజోమ్ లేదా జన్యుపరమైన అసాధారణత కారణంగా జరుగుతాయి. ఒకవేళ పిండంలో ఏదైనా జెనెటికల్ డ్యామేజ్ ఉంటే పిండం ఎదగడం కష్టం. రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టడం అనేది మిస్ క్యారేజ్ కు రెండో కారణం. సబ్ క్రోనిక్ రక్తస్రావంతో కూడా గర్భం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. రెండవ త్రైమాసికంలో మిస్ క్యారేజ్ అయితే గర్భాశయం లేదా సర్విక్స్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 

నివారణ..

మిస్ క్యారేజ్ నివారించడానికి తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారం తీసుకోవడం. అలా చేస్తే పుట్టుకతో   వచ్చే లోపాలను తగ్గించే అవకాశం ఉంది. అలాగే మిస్ క్యారేజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ప్లాన్ చేసుకున్న మూడు నెలల ముందు నుంచి 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ప్రెగ్రెన్సీ సమయంలోనూ దీన్ని కొనసాగించచాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, మంచి ఆహారం తినడం, హైడ్రేటెడ్ గా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే ఎంతో మేలు.