04-05-2025 12:00:00 AM
దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్లలో చాలామంది ప్రతిరోజూ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటివాళ్లలో కొందరు ట్యాబ్లెట్స్ వేసుకోవడం మరచిపోవడం లేదంటే వేసుకున్న విషయం మర్చిపోయి రెండోసారి వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. దానివల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకు బెస్ట్ సొల్యూషన్ ఈ పిల్ ఆర్గనైజర్.
దీన్ని పాప్ క్యూబ్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఏడు రోజులకు గాను ఏడు పెద్ద కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి కంపార్ట్మెంట్ లో నాలుగు స్లాట్స్ ఉంటాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా ఒక్కోపూట వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ని ఒక్కో స్లాట్ లో పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ ని ఏబీఎస్ ప్లాస్టిక్ కంపెనీవారు తయారుచేశారు. ఇది కింద పడినా లోపల ఉన్న ట్యాబ్లెట్స్ విరిగిపోవు. వారం రోజులకు సరిపడా ట్యాబ్లెట్స్ ని ఈ బాక్స్ లో వేసి పెట్టుకోవచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకున్న విషయం మరచిపోయినా.. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. తెలిసిపోతుంది.