calender_icon.png 1 July, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం..

30-06-2025 10:25:13 PM

దిల్‌సుఖ్‌నగర్ లో ఘటన..

ఎల్బీనగర్: తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన లా చదువుతున్న కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని నేతాజీ నగర్ కు చెందిన వి.సుష్మిత తండ్రి శ్రీనివాస్ లా చదవడానికి ఎన్టీఆర్ నగర్ లోని మహాత్మా గాంధీ లా కళాశాల(Mahatma Gandhi Law College) చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌ లోని పీ అండ్ టీ కాలనీలో ఉన్న అక్షయ డీలక్స్ గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది.

నెల రోజుల క్రితం తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తల్లి మృతి చెందడంతో మనస్థాపానికి గురైన సుష్మిత సోమవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. భవనంపై నుంచి దూకడంతో ఆమె రెండు కాళ్లకు గాయాలు కాగా, హాస్టల్ యాజమాన్యం కొత్తపేటలో ఉన్న ఓమ్ని హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.