calender_icon.png 1 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ కు తృతీయ స్థానం

30-06-2025 10:43:12 PM

జావేద్ హుస్సేన్కు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్(Rugby Premier League) తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్(Hyderabad Heroes) మూడో స్థానాన్ని కైవసం చేసుకుందని హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మాన్యుయెల్ మోరెనో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్(Bengaluru Bravehearts)తో జరిగిన వర్గీకరణ పోరులో 17-12 తేడాతో గెలిచిందన్నారు. ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో నిలిచిన హీరోస్ జట్టు అందుకు తగ్గట్టుగా ఆడిందన్నారు. గాయాల కారణంగా జావేద్ హుస్సేన్, టెరియో తమాని, లౌతారో బజన్ వెలెజ్ వంటి కీలక ఆటగాళ్ల సేవలు లేకుండానే ఈ పోరులో స్థిరంగా ఆడి బ్రేవ్‌హార్ట్స్ ను ఓడించిందన్నారు. కెప్టెన్ మోరెనో, జోజి నసోవా, కెవిన్ వెకేశా, భూపిందర్ సింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.