30-06-2025 10:59:16 PM
రౌడీషీటర్ షాహిద్‌గా గుర్తింపు..
కూకట్‌పల్లి (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధిలో ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి యన్ క్లేవ్ సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో పవన్ అనే స్నేహితుని పుట్టినరోజుకు హాజరైన మరో నలుగురు యువకులు షాహిద్, షాజిద్, సమీర్, మున్నా మద్యం సేవించి షాహిద్ ను హత్యచేశారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ... బోరాబండకు చెందిన సయ్యద్ షాహిద్ సాజిద్‌ను డబ్బులు డిమాండ్ చేయడాన్ని భరించలేక ఒక నెల నుంచి షాహిద్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
పవన్ పుట్టినరోజున అందరూ ఒక చోటకు చేరి మద్యం సేవించిన అనంతరం షాయద్ ను మద్యం బాటిల్ పగలగొట్టి గొంతులో పొడిచారు. మరో రెండు బాటిల్ లు తలపై పగలగొట్టారు. షాహిద్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేశాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే బోరబండ కు చెందిన షాహిద్ సాజిత్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లుగా గుర్తించినట్లు ఏసిపి వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలను వెల్లడిస్తామని ఎసిపి పేర్కొన్నారు.