30-06-2025 10:53:38 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని మాల బస్తీ వాసుల ఫిర్యాదు మేరకు డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్(Division Corporator A. Pavani Vinay Kumar) ప్రత్యేక చొరవతో మాల బస్తీలో విద్యుత్ తీగలు ఇళ్లకు ప్రమాదకరంగా వుండడంతో పాటు బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా వున్న కరెంటు స్థంభాన్ని తొలగించి నూతన సిమెంట్ విద్యుత్ స్థంభాన్ని ఎలక్ట్రికల్ సిబ్బంది ఏర్పాటు చేసారు. కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఎలక్ట్రికల్ ఎ.ఈ సంతోష్, బీజేపీ నేతలు బస్తి వాసులతో కలిసి నూతన పోల్ ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మదన్మోహన్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్ బస్తి వాసులు సునీల్, విజయ్, మల్లేష్, రాజమని, భాను, క్రాంతి, చేతన్ తదితరులు పాల్గొన్నారు.