10-10-2025 01:46:07 AM
తుది జట్టులో మార్పులు లేనట్టే
ఉ.9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : భారత్ , వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుకు అంతా సిద్ధమైంది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచే మ్యాచ్ ఆరంభం కానుం ది. తొలి టెస్టులో విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
అదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్ట్ కూడా గెలిచి సిరీస్‌ను 2 తో స్వీప్ చేయడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు తొలి టెస్టులో కనీసపోటీ ఇవ్వలేకపోయిన విండీస్ సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో గెలిచితీరాల్సిందే.
అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా చెలరేగిపోతే... బ్యాటింగ్‌లో అంచనాలు పెట్టుకున్న కీలక ఆటగాళ్లు రాణించారు. ఫలితంగా విండీస్ పై ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో సాయిసుదర్శన్ తప్పిస్తే మిగిలిన వారంతా సత్తా చాటారు.
కేఎల్ రాహుల్ , ధృవ్ జురెల్ , రవీంద్ర జడేజా శతకాలతో రెచ్చిపోయారు. కెప్టెన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిసాడు. వీరంతా అదరగొట్టడంతోనే భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడే అవ సరం లేకుండా భారీ ఆధిక్యాన్ని అందుకుని మ్యాచ్‌ను శాసించింది. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్ , కుల్దీప్ చెలరేగిపోవడంతో విండీస్ బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు.
తుది జట్టులో మార్పులు లేనట్టే
విండీస్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో మార్పులు లేకపోవచ్చు. సిరీస్‌ను 2 గెలవడమే లక్ష్యంగా విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే అవకాశం లేదని తెలు స్తోంది. సాయిసుదర్శన్ నిరాశపరిచినా అతనికి మరో అవకాశమివ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
దీంతో పడిక్కల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో నితీశ్‌కుమార్‌రెడ్డికి ప్రమోషన్ దక్కే ఛా న్సుంది. బౌలింగ్ కాంబినేషన్‌లో సైతం ఎ లాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. బుమ్రా, సిరాజ్ పేసర్లుగా కొనసాగనున్నారు.
పిచ్ మూడోరోజు నుంచి స్పిన్నర్లదే
రెండో టెస్ట్ కోసం కొత్త పిచ్‌ను రెడీ చేశారు. పూర్తిగా స్పిన్‌కే కాకుండా బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తుంది. మొదటి రెం డు రోజులు బ్యాటర్లు పరుగులు చేసే అవకాశముంది. అయితే మూడో రోజు నుంచి మాత్రం బంతి టర్న్ అవుతుందని, స్పిన్నర్లకు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు.
విండీస్ బ్యాటర్లకు నిలుస్తారా ?
మరోవైపు అహ్మదాబాద్ టెస్టు లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్ రెండో టెస్టులోనైనా కనీస పోటీ ఇస్తుందా అనేది చూడాలి. ఎన్నో అంచనాలు పెట్టుకు న్న క్యాంప్‌బెల్, చంద్రపాల్, బ్రెండన్ కింగ్, హోప్ ఎవ్వరకూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నారు. ఇంతటి ఒత్తిడి మధ్య భారత బౌలింగ్‌ను తట్టుకుని పరుగులు చేయడం విండీస్ బ్యాటర్లకు పెను సవాల్‌గానే చెప్పాలి.
భారత తుది జట్టు(అంచనా)
జైశ్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్(కెప్టెన్), జురెల్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్
వెస్టిండీస్ తుది జట్టు (అంచనా)
క్యాంప్‌బెల్, చంద్రపాల్, అతినాజే, కింగ్, ఛేజ్(కెప్టెన్), హోప్, గ్రేవ్స్, పీర్రే, వారికన్, లైన్/బ్లేడ్స్, సీల్స్