07-10-2025 12:19:19 AM
ఏఐసీసీ ఇన్‌చార్జ్‌కు వినతి పత్రం
శామీర్ పేట్, అక్టోబర్ 6: ఎన్నో ఏండ్లు గా రెవెన్యూ సమస్యతో ఇబ్బంది పడుతున్న లక్ష్మాపూర్ గ్రామం ప్రజల సమస్యను పరిష్కరించాలని క్యాతం మధు కృష్ణ సోమ వారం ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని లక్ష్మాపూర్ గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి రెవెన్యూ సమస్యతో బాధపడుతున్నారని ఎమ్మెల్యేలకు ,
మంత్రులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసిన వారి సమస్య ఎక్కడ వేసిన గొంగడిలాగే ఉందని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే నూతనంగా ఏర్పడిన మూ డు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సరైన నిధులు కేటాయించటానికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మీనాక్షి నటరాజన్ ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అలాగే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.