11-07-2025 12:25:31 AM
- ధర్మాసుపత్రికి రాజకీయ జబ్బు
- పాలకులు వస్తారూ...చూస్తారు వెళ్తారు..
- వందపడకల హస్పిటల్.. సేవలు ఎప్పుడందుతాయ్?
- పెద్దాసుపత్రికి రెండు సంవత్సరాల క్రితమే పూర్తి.... పట్టింపు కరవు
- తాజాగా హైకోర్టు ఆదేశాల మళ్లీ తెరపైకి..
- హైకోర్టు హెచ్చరించినా మారని తీరు...
- అలంపూర్ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా పాలకులు
అలంపూర్, జూలై 10: పేదల పెద్దాసుపత్రి అయిన అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల హస్పిటల్ రాజకీయ పడగలో శిథిలావస్థకు చేరుకుంది. ఇదిగో అప్పుడు ఇప్పు డు ప్రారంబిస్తాం అంటూ దోబుచ్చు లాడు తూ అధికారులు, పాలకులు పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రూ 21కోట్ల ప్రజా ధనంతో సేవలందించాల్సిన వందపడకల హస్పిటల్ ను పాలకులు, అధికారులు గాలికి వదిలేశారు.
వైద్యం కోసం పెద్దాసుపత్రి వైపు
జాతీయ రహదారి 44పై ఏ ప్రమాదం జరిగిన కర్నూల్ అస్పత్రిపైనే ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా వైద్య సే వలు ఆలస్యంతో పలువురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పో యిన ఘటనలు సైతం ఉ ్నయి. ఈ ఆస్పత్రి ప్రారంభం అయ్యాక వై ద్య సేవలకు అవసరమైన సామాగ్రి, సదుపాయాలు ఏర్పాటు చేశారు. 100 పడకల్లో సా మాగ్రి, ఆక్సిజన్ పరికరాలు, స్లున్ బాటిల్ స్టాండ్స్, వైద్య పరీక్షలు నిర్వహించే పరికరా లు అన్ని వచ్చేశాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, జనరల్, మెటర్నరీ వార్డులు సకల సదుపాయాలు కల్పించారు. నెలలు గడుస్తున్నా వై ద్యులు, సిబ్బంది కేటాయింపులు లేక విలువైన వైద్య సామాగ్రి దుమ్ము పట్టిపోతు న్నాయి. కొన్ని పరికరాలు, సామాగ్రి చోరికి గురైంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవనం హంటెడ్ హౌజ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నూతన ఆసుపత్రి ప్రారంభంమేప్పుడో..
రెండు ఏళ్లుగా పూర్తయిన వందపడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో ఏచిన్న జబ్బు చేసిన కర్నూలు పెద్దాసుపత్రి వెళ్లాల్సిందే.అందరికీ అందుబాటులో ఉంటుందని అలంపూర్ చౌరస్తా ప్రాంతంలో నిర్మించిన ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభవుతుందో..?, ఎప్పుడు వైద్యం అం దుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
నిర్మాణంలో నాణ్యత లోపం
బిల్డింగ్ను పట్టించుకునే వారు లేకపోవడంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. గతంలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైప్ లైన్ లో ఉండే కాపర్ వైర్లు, ట్యాప్ లు, ఇతర సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక క్వాలిటీ లేకుండా హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టడంతో వర్షాలకు లీకేజీ అవుతోంది. దొంగలు ఎత్తుకెళ్లిన పైప్ లైన్లు, ట్యాప్ లను రూ 20లక్షలతో ఏర్పాటు చేశారు. అండర్ డ్రైనేజీ సౌలతులు కల్పించి, లీకేజీలకు రిపేర్లు చేస్తే తప్ప హాస్పిటల్ ఓపెనింగ్ చేయలేని పరిస్థితి ఉంది.
పేదల వైద్యంపై చిన్నచూపు
అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సదుపాయాలు ఉన్న హస్పిటల్ లేదు. దీంతో జాతీయ రహదారిపై క్షతగాత్రులు కొందరు, గ్రామాల్లో సరైనా వైద్యం అందక మరికొందరు ప్రాణాలు కొల్పుతున్నారు.అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన వందపడకల హస్పిటల్ నిర్మాణం తో మాకష్టాలు తీరుతాయి,అనుకున్న సమయంలో పాలకులు,అధికారులు మీరంటే మీరు అంటూ వందపడకల హస్పిటల్ ను పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల సమయంలో తప్ప నాయకులకు ప్రజలు గుర్తుకు రారు.ఇప్పటికైనా అధికారులు,పాలకులు స్పందించి హస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్