calender_icon.png 28 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో గెలుపోటములు సహజం

28-01-2026 12:00:00 AM

రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్

ములుగు, జనవరి27,(విజయక్రాంతి):క్రీడల్లో గెలుపోటములు సహజమని రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బండారుపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ హాజరై క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు..

విద్యార్థులు మంచి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల గౌరవాన్ని పెంపొందించాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, సమాజంలో చదువు అన్నిటికీ మూలమని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. అనంతరం బాదం ప్రవీణ్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు బాదం ప్రవీణ్ ను శాలువాలతో సత్కరించారు.