calender_icon.png 28 January, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సేవలకే ‘రెవెన్యూ’లో మార్పులు

28-01-2026 12:00:00 AM

కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

ప్రైవేటు రంగ సంస్థలతో కార్యాలయాల నిర్మాణం

  1. ఐదేళ్లు కార్యాలయాల నిర్వహణ బాధ్యత ఆ సంస్థలదే..
  2. నేడు పటాన్‌చెరులో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
  3. రెండవ విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలు
  4. రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజలకు పారదర్శ కంగా ఉత్తమ  సేవలు అందించాలనే లక్ష్యం తో  రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పదేళ్లలో ఆనాటి పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. గడిచిన రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకు వ్యవస్థను సంస్కరిస్తూ రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుపై మంగళవా రం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడకుండా ప్రైవేటు రంగ సంస్థ లతో నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మాణం తో పాటు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతను కూ డా ఆ సంస్థలే తీసుకున్నాయని తెలిపారు. 

మూడు నుంచి ఐదు ఎకరాల స్థలంలో..

మూడు నుంచి ఐదు ఎకరాల స్థలంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజీ హాల్, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియా మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యం తదితరాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మిగిలిన కార్యాలయాలకు శంకుస్థాపనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

రెండవ విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన కార్యాచర ణను సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జూన్ 2వ తేదీ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇటీవల మేడ్చల్ జిల్లాలో భవనానికి శంకుస్థాపన చేశామని, పటాన్‌చెరు ప్రధాన రహదారి సమీపంలో  రాజపుష్ప కనస్ట్రక్షన్ నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనానికి బుధవారం భూమిపూజ చేయనున్నట్లు తెలిపా రు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బు కింగ్, ఈ సంతకం వంటి సౌకర్యాలతో ప్రజల సమయాన్ని ఎంతో ఆదా చేశా మని తెలిపారు. రెవెన్యూ శాఖలో తీసుకుంటున్న ఈ సంస్కరణలు కేవలం కార్యాల యాల మార్పు మాత్రమే కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్కరణలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం

రాష్ర్టంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. అక్రిడిటేషన్ అంశంపై అన్ని పాత్రికేయ సంఘాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులతో కొత్త  జీవోను జారీ చేశామన్నారు. మంగళవారం సచివాలయంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.